తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'టీకా తీసుకుంటే 8 నెలలు రక్షణ' - Covid-19 vacciene protection time

కరోనా టీకా.. వైరస్‌ నుంచి 8నెలల పాటు రక్షణ కల్పిస్తాయని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు. టీకా తీసుకుంటే ఎంతకాలం రక్షణ లభిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతుండటంతో ఈ మేరకు స్పందించారు.

Corona vaccine protects against the virus for up to 8 months: Randeep Guleria
కరోనా నుంచి టీకా ఎన్నాళ్లు రక్షిస్తుంది?

By

Published : Feb 13, 2021, 5:52 AM IST

కొవిడ్​ టీకా పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజల్లో తలెత్తిన ప్రశ్నలకు సామాజిక మాధ్యమం ద్వారా జవాబిచ్చారు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా. ఈ నేపథ్యంలో కరోనా టీకా.. వైరస్‌ నుంచి 8నెలల పాటు రక్షణ కల్పిస్తాయని గులేరియా తెలిపారు. టీకా తీసుకుంటే ఎంతకాలం రక్షణ లభిస్తుందనే ప్రశ్నలు వ్యక్తమవుతుండటంతో ఈ మేరకు స్పందించారు.

రక్షణ కాల వ్యవధిని పెంచేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నట్లు గులేరియా తెలిపారు. కరోనా కట్టడికి ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడైన ఆయన.. ప్రజల ప్రశ్నలకు సామాజిక మాధ్యమం ద్వారా జవాబిచ్చారు. రెండో డోసు తీసుకున్న వారిలో దాదాపు 14 రోజుల తర్వాత యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయన్నారు. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 75 లక్షలకుపైగా కొవిడ్‌టీకా డోసులు పంపిణీ చేసినట్లు రణదీప్‌ గులేరియా ప్రకటించారు.

ఇదీ చూడండి:రైతుల ఆందోళనపై కెనడా ప్రధాని యూ టర్న్​

ABOUT THE AUTHOR

...view details