దేశంలో 15-18 ఏళ్ల వయసు కలిగిన టీనేజీ పిల్లలకు సోమవారం నుంచి కొవిడ్ టీకాల పంపిణీని ప్రారంభించనున్నారు. పెద్దల మాదిరిగానే వీరికి కూడా ఒక్కో డోసులో 0.5 మి.లీ. మోతాదు చొప్పున ఇవ్వనున్నారు. ఈ వయసు టీనేజర్లందరికీ కొవాగ్జిన్ టీకాను మాత్రమే అందించనున్నారు. తొలిడోసు స్వీకరించిన 4 వారాల తర్వాత రెండో డోసును అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.
మౌలిక వసతులు పెంచుకోండి: కేంద్రం
దేశంలో 15-18ఏళ్ల పిల్లలకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్నందున.. జాగ్రత్తలన్నీ తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సూచించారు. ఇతర వయసుల వారికి వేసే టీకాలు ఇందులో కలిసిపోకుండా.. పిల్లల కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలు పెట్టాలని స్పష్టంచేశారు. ఒమిక్రాన్ వ్యాప్తి కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేయాలని కోరారు.
- దేశవ్యాప్తంగా కొవిడ్ టీకాల కోసం ఆదివారం సాయంత్రం వరకు 6.35 లక్షల మంది 15-18 ఏళ్ల పిల్లలు కొవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు.
ఇదీ చూడండి:ఒమిక్రాన్.. నేచురల్ వ్యాక్సినా? సోకితే మంచిదేనా?