తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అందుకు సిద్ధంగా ఉండాల్సిందే.. రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం - Covid variants

Corona Situation India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కొవిడ్​-19 క్లినికల్​ చికిత్సలో ఉపయోగించే 8 డ్రగ్స్​ బఫర్​ స్టాక్​ ఉండేలా చూసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టం చేసింది.

Ensure adequate stock of drugs
Centre tells states

By

Published : Dec 9, 2021, 5:46 PM IST

Corona Situation India: దేశవ్యాప్తంగా కొవిడ్​ పరిస్థితులపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించింది కేంద్రం. కొవిడ్​ సంసిద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్ చర్చించారు​.

కొవిడ్​-19 క్లినికల్​ చికిత్సలో ఉపయోగించి 8 డ్రగ్స్​ బఫర్​ స్టాక్​ ఉండేలా చూసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కేసులు పెరిగితే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయా? అన్న అంశంపైనా సమీక్షించారు.

Omicron in India: కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు, పీఎస్​ఏ ప్లాంట్లు, ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని ఆయా రాష్ట్రాలకు స్పష్టం చేశారు.

టెస్ట్​, ట్రాక్​, ట్రీట్​, వ్యాక్సినేట్​, కొవిడ్​ నిబంధనలకు లోబడి ఉండటం.. అనే ఐదు సూత్రాలను ప్రధానంగా ప్రస్తావించారు రాజేశ్​ భూషణ్​. ఇవే కరోనా నివారణకు మార్గాలని అన్నారు.

''రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కరోనా టెస్టులపై దృష్టి సారించాలి. అనుమానిత కేసులను వీలైనంత త్వరగా గుర్తిస్తూ.. వారి ఐసోలేషన్​, చికిత్స వంటివి అందించాలి. అన్ని జిల్లాల్లో ఆర్​టీ-పీసీఆర్​ టెస్టింగ్​ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.''

- రాజేశ్​ భూషణ్​, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి

హాట్​స్పాట్​లు, బ్రేక్​త్రూ ఇన్​ఫెక్షన్​ కేసుల అంశంపైనా సమీక్షలో చర్చించారు. పాజిటివ్​గా నిర్ధరణ అయిన బాధితుల సన్నిహితుల వివరాలను సేకరించి.. ప్రొటోకాల్​ ప్రకారం టెస్టులు జరపాలని ఆయన స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి.. ఏం జరిగింది?

Helicopter Safe Travel: ఈ రూల్స్​ ఫాలో అయితేనే చాపర్ జర్నీ సేఫ్​!

ABOUT THE AUTHOR

...view details