ఆస్పత్రిలో పడక లభించక సొంత కారులోనే తుదిశ్వాస విడిచాడు ఓ కరోనా రోగి. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని చంద్రాపుర్లో జరిగింది.
వైరస్ బారిన పడిన వ్యక్తిని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు బంధువులు. అయినప్పటికీ ఎక్కడా వారికి పడక దొరకలేదు. దీంతో కారులోనే అతడు చనిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అతడిని కాపాడుకోలేకపోయామంటూ కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.