తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆస్పత్రి మెట్ల వద్ద.. భార్య ఒడిలోనే కరోనా రోగి మృతి - మహారాష్ట్ర

మహారాష్ట్రలో సమయానికి ప్రాణవాయువు అందక మరో కరోనా రోగి మరణించాడు. కనీసం పడక లభించక.. ఆస్పత్రి మెట్ల వద్ద భార్య ఒడిలోనే ప్రాణాలు వదిలాడు.

CORONA PATIENT DIES ON THE PORCH OF HOSPITAL IN NASHIK
భార్య ఒడిలో కరోనా రోగి మృతి

By

Published : Apr 22, 2021, 11:12 AM IST

Updated : Apr 22, 2021, 2:32 PM IST

ఆక్సిజన్, పడక అందక భార్య ఒడిలోనే కన్నుమూసిన కరోనా రోగి

ఆక్సిజన్ కొరత మరో ప్రాణాన్ని బలితీసుకుంది. పడకలు లభించిక ఆస్పత్రి మెట్ల వద్దే కుప్పకూలాడు ఓ కరోనా రోగి. వైద్యం కోసం అతడి భార్య ఎంత అర్థించినా సహాయం చేసే నాథుడే కరవయ్యాడు. చివరకు ఆమె ఒడిలోనే ఊపిరి వదిలాడు. ఈ హృదయవిదారక ఘటన మహారాష్ట్రలోని నాసిక్​లో బుధవారం జరిగింది.

కరోనాతో బాధపడుతున్న అరుణ్ మాలీ అనే వ్యక్తిని చాంద్వాడ్​ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చింది అతడి భార్య. అయితే పడకల కొరత కారణంగా అతడిని చేర్చుకోలేదు. కనీసం ఊపిరి తీసుకోలేని స్థితిలో ఉన్న మాలీకి ఆక్సిజన్​ అయినా అందించాలని అతడి భార్య రోదించినా సహాయం కరవైంది. చికిత్స కన్నా ముందే చావు అతడిని పలకరించింది. దీంతో భార్య కన్నీరుమున్నీరై విలపించింది.

ప్రాణం తీసిన ఆలస్యం!

అయితే అరుణ్ పరిస్థితి దృష్ట్యా.. అతడికి పడక ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. అందుకోసం ఆరోగ్యం నిలకడగా ఉన్న ఓ రోగి పడకను ఖాళీ చేసినట్లు వెల్లడించారు. కానీ, అది అతడికి అందించేలోపే మృతిచెందినట్లు వివరించారు.

ఇదీ చూడండి:ఆక్సిజన్​ ట్యాంకు లీకేజీ... 24 మంది మృతి

Last Updated : Apr 22, 2021, 2:32 PM IST

ABOUT THE AUTHOR

...view details