దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. దిల్లీలో శుక్రవారం కొత్తగా 115 కేసులు(COVID Cases) నమోదయ్యాయి. మరో నలుగురు మృతి చెందారు.
వివిధ రాష్ట్రాల్లో ఇలా..
- కేరళలో కొత్తగా 11,546 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 11,056 మంది కోలుకోగా, 118 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మహారాష్ట్రలో కొత్తగా 9,677 కేసులు బయటపడ్డాయి. 10,138మంది డిశ్చార్జ్ అవగా.. 156 మంది మృతి చెందారు.
- కర్ణాటకలో కొత్తగా 3,310 కేసులు నమోదవగా.. 6,524 మంది డిశ్చార్జ్ అయ్యారు. 114 మహమ్మారికి బలయ్యారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్తగా 226 కేసులు వెలుగులోకి వచ్చాయి. 17 మంది మృతి చెందారు.
పెరుగుతున్న కేసులు..
మరోవైపు డెల్టాప్లస్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 51మందికి ఈ రకం వైరస్ సోకిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 22 మంది కరోనా బాధితుల్లో డెల్టా ప్లస్ వేరియంట్‌ను గుర్తించినట్లు చెప్పింది.
తమిళనాడులో 9, మధ్యప్రదేశ్‌లో 7, కేరళలో 3, పంజాబ్‌లో 2, గుజరాత్లో 3,ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, జమ్ముకశ్మీర్, హరియాణా, కర్ణాటకలో ఒక్కో కేసు చొప్పున ఈ తరహా వైరస్ కేసులను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 45,000 నమూనాలను పరీక్షించగా ఈ ఫలితాలు నమోదైనట్లు పేర్కొంది.
ఇదీ చూడండి:'డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు చర్యలేవి?'
ఇదీ చూడండి:కొవిడ్‌పై పోరులో 'డెల్టా'నే అతి పెద్ద ముప్పు!