వారం రోజుల చిన్నారిని కరోనా కబళించిన హృదయ విదారక ఘటన మహారాష్ట్రలో జరిగింది. పాల్ఘడ్ జిల్లాలోని దర్శెత్కు చెందిన ఓ చిన్నారికి కొద్ది రోజుల క్రితం కరోనా సోకింది. పుట్టిన 12 గంటలకు చేసిన పరీక్షలో అతడికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది.
అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే చికిత్స పొందుతున్న చిన్నారిని మెరుగైన వైద్యం కోసం తొలుత జవహర్ ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ఆరోగ్యం మరింత క్షీణించడం వల్ల ఆ తర్వాత నాసిక్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన పసికందు తుదకు జూన్ 5న ప్రాణాలు విడిచాడు.