ఉత్తర్‌ప్రదేశ్ భాజపా ఎమ్మెల్యేలు ఇద్దరు శుక్రవారం.. కరోనాతో మృతి చెందారు. లఖ్‌నవూ(పశ్చిమ) శాసనసభ్యుడు సురేశ్‌కుమార్ శ్రీవాస్తవ(76), ఔరైయ సదర్ ఎమ్మెల్యే రమేశ్ చంద్ర(56) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వీరి మృతి పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్లో స్పందించారు. ఎమ్మెల్యేల మరణ వార్తతో ఆయా నియోజకవర్గాల్లో విషాదం నెలకొంది.
మధ్యప్రదేశ్‌లో..
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత, జోబాట్ నియోజకవర్గ శాసనసభ్యురాలు కళావతి భూరియా కరోనాతో మరణించారు. ఆమె కొద్దిరోజులుగా ఇందోర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.