తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్కూల్​లో 85, వర్సిటీలో 13 మంది విద్యార్థులకు కరోనా - జవహార్ నవోదయా విద్యాలయలో కరోనా

Corona in Shri Mata Vaishno Devi University: జమ్ముకశ్మీర్​లోని శ్రీ మాతా వైష్ణోదేవీ యూనివర్సిటీలో 13 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు తేలింది. దీంతో విశ్వవిద్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు.. ఉత్తరాఖండ్​లోని ఓ పాఠశాలలో 85 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది.

corona in shri mata vaishno devi university
మాతా వైష్ణోదేవీ యూనివర్సిటీలో కరోనా

By

Published : Jan 2, 2022, 12:25 PM IST

Corona in Shri Mata Vaishno Devi University: జమ్ముకశ్మీర్​ కాట్రాలోని శ్రీ మాతా వైష్ణోదేవీ యూనివర్సిటీలో కరోనా మహమ్మారి కలకలం రేపింది. 13 మంది విద్యార్థులకు కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయింది. దీంతో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు విశ్వవిద్యాలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

డిసెంబరు 31న యూనివర్సిటీలోని విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించామని రియాసీ జిల్లా ముఖ్య వైద్యాధికారి తెలిపారు. అందులో 13 మందికి కొవిడ్ సోకినట్లు తేలిందని చెప్పారు.

Jammu kashmir Covid cases:

జమ్ముకశ్మీర్​లో కొత్తగా 169 కరోనా కేసులు వెలుగు చూశాయి. అందులో 68 కేసులు జమ్ములో నమోదుకాగా... 101 కేసులు కశ్మీర్​లో బయటపడ్డాయి. శనివారం 107 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

పాఠశాలలో కరోనా..

Corona in Navodoya Vidyalaya: ఉత్తరాఖండ్​ నైనితాల్ జిల్లాలోని జవహార్ నవోదయ విద్యాలయలో 85 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు శనివారం నిర్ధరణ అయింది. "పాఠశాల సిబ్బంది సహా 11 మంది విద్యార్థులు కరోనా బారినపడినట్లు తొలుత తేలింది. దాంతో పాఠశాలలోని 496 మంది విద్యార్థుల వద్ద నమూనాలను సేకరించి పరీక్షలు జరిపాం. అందులో 85 మంది విద్యార్థులకు కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది" అని నైనితాల్ జిల్లా కలెక్టర్ రాహుల్ సాహ్ తెలిపారు.

పాఠశాలలో విద్యార్థులకు కరోనా నిర్ధరణ కావడం వల్ల.. కలెక్టర్ రాహుల్ సాహ్ ఆదేశాల మేరకు పాఠశాలను మైక్రో కంటెయిన్​మెంట్ జోన్​గా ఏర్పాటు చేశామని ఓ అధికారి తెలిపారు. అంతేగాకుండా.. విద్యార్థులు ఐసొలేషన్​లో ఉండేలా పాఠశాలలోనే ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఆర్​టీపీసీఆర్​లో కరోనా నెగెటివ్​గా తేలిన విద్యార్థులకు మరోసారి యాంటీజెన్ పరీక్షలు నిర్వహించి డిశ్ఛార్జి చేస్తున్నామని వెల్లడించారు.

ఉత్తరాఖండ్​లో శనివారం నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఫలితంగా ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 8కి చేరింది.

India covid cases: దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా భారీగా నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 27,553 కేసులు వెలుగుచూశాయి. మరో 284 మంది ప్రాణాలు కోల్పోయారు. 9,249 మంది కోలుకున్నారు. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,525 కి చేరడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఇదీ చూడండి:కొవిడ్ వ్యాక్సిన్​ అని చెప్పి.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్​

ఇదీ చూడండి:ఏడాదిగా జీరో కరోనా మరణాలు​​.. తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లింపు

ABOUT THE AUTHOR

...view details