తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో మరో 46,148 మందికి కరోనా - మొత్తం కరోనా కేసులు

దేశంలో కొత్తగా 46,148 కరోనా కేసులు నమోదయ్యాయి. 58,578 మంది కోలుకోగా 979 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఒక్కరోజే 17,21,268 మందికి టీకా అందించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

india covid cases, కొవిడ్​ కేసుల సంఖ్య
దేశంలో మరో 46,148 మందికి కరోనా

By

Published : Jun 28, 2021, 9:37 AM IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 46,148 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి మరో 979 మంది మృతి చెందారు. 58,578 మంది కోలుకున్నారు. 96.80 శాతం రికవరీ రేటు నమోదైంది.

  • మొత్తం కేసులు : 3,02,79,331
  • మొత్తం మరణాలు : 3,96,730
  • కోలుకున్నవారు : 2,93,09,607
  • యాక్టివ్​ కేసులు : 5,72,994

దేశవ్యాప్తంగా ఆదివారం 15,70,515 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. మొత్తం టెస్టుల సంఖ్య 40,51,59,716కు చేరినట్లు పేర్కొంది.

వ్యాక్సినేషన్..

ఆదివారం ఒక్కరోజే 17,21,268 మందికి టీకా అందించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు 32,36,63,297 వ్యాక్సిన్​ డోసులు పంపిణీ చేసినట్లు స్పష్టం చేసింది.

ఇవీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details