మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శనివారంతో పోలిస్తే రోజువారీ కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం కొత్తగా 2,946 మందికి వైరస్ నిర్ధరణ అయింది. అందులో ఒక్క ముంబయిలోనే 1,803 కేసులు రావటం ఆందోళన కలిగిస్తోంది. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క్రియాశీల కేసులు 16వేల మార్క్‌ను దాటాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 79,10,577, మరణాలు 1,47,870కు చేరాయి.
రాష్ట్రంలో మరణాల రేటు 1.86 శాతానికి చేరింది. ఆదివారం ఒక్కరోజే 1,432 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 77,46,337కు చేరింది. రికవరీ రేటు 97.92గా ఉంది. ఆదివారం మొత్తం 42,922 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.