దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో(Covid in India) తగ్గుదల కనిపించినా.. మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా కొత్తగా 4,002 మంది కొవిడ్(Corona deaths) బారినపడి మరణించారు. తాజాగా మరో 84,332 కేసులు వెలుగులోకి వచ్చాయి. 70 రోజుల తర్యాత ఇంత తక్కువ స్థాయిలో కేసులు నమోదయ్యాయి.
- మొత్తం కేసులు: 2,93,59,155
- యాక్టివ్ కేసులు: 10,80,690
- కోలుకున్నవారు: 2,79,11,384
- మొత్తం మరణాలు: 3,67,081
కరోనా సోకిన వారిలో మరో 1,21,311 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో రికవరీ రేటు 95.07 శాతానికి పెరిగింది. మరణాల రేటు స్థిరంగా 1.24 శాతానికి తగ్గింది.