తెలంగాణ

telangana

By

Published : Jul 1, 2021, 9:46 AM IST

Updated : Jul 1, 2021, 10:26 AM IST

ETV Bharat / bharat

Covid cases: దేశంలో మరో 48,786 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 48,786 కరోనా కేసులు నమోదయ్యాయి. 61,588 మంది కోలుకోగా 1005 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా బుధవారం 27,60,345 డోసుల పంపిణీ జరిగింది.

corona cases india,
దేశంలో కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి(Covid cases India). కొత్తగా 48,786 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి మరో 1005 మంది ప్రాణాలు కోల్పోయారు(corona deaths India). వైరస్ నుంచి 61,588 మంది కోలుకున్నారు.

  • మొత్తం కేసులు : 30,411,634
  • మొత్తం మరణాలు : 399,459‬
  • కోలుకున్నారు : 29,488,918‬
  • యాక్టివ్ కేసులు : 5,23,257

పరీక్షలు..

దేశవ్యాప్తంగా బుధవారం 19,21,450 మందికి కొవిడ్​-19 పరీక్షలు చేసినట్లు కేంద్రం పేర్కొంది.

వ్యాక్సినేషన్​..

దేశవ్యాప్తంగా బుధవారం 27,60,345 డోసుల పంపిణీ జరిగింది. ఇప్పటివరకు 33,57,16,019 వ్యాక్సిన్​ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి :Covovax: పిల్లలపై ట్రయల్స్​కు అనుమతికి నో

Last Updated : Jul 1, 2021, 10:26 AM IST

ABOUT THE AUTHOR

...view details