తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటక, మహాలో 14వేలకు దిగొచ్చిన కేసులు - corona cases in tamilandu

దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య మరింత తగ్గింది. తమిళనాడులో 26వేల కేసులు వెలుగుచూడగా, కర్ణాటక, మహారాష్ట్రల్లో 14వేలకు దిగొచ్చాయి. రికవరీల సంఖ్య కూడా బాగా పెరిగింది.

corona cases
కరోనా కేసులు

By

Published : Jun 1, 2021, 9:59 PM IST

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. తమిళనాడులో కొత్తగా 26,513 కేసులు నమోదయ్యాయి. 490మంది ప్రాణాలు కోల్పోయారు. 31,673 మంది డిశ్చార్జ్ అయ్యారు.

దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 623 కేసులు వెలుగులోకి వచ్చాయి. 62మంది మరణించారు.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..

  • మహారాష్ట్రలో 14,143 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. 477 మంది చనిపోయారు.
  • కేరళలో 19,760 కేసులు నమోదయ్యాయి. 194 మంది మృతి చెందారు.
  • కర్ణాటకలో 14,304 కేసులు బయటపడ్డాయి. 464 మంది మరణించారు.
  • బంగాల్​లో 9,424 కేసులు వెలుగుచూశాయి. 137 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • హరియాణాలో 1,233 మందికి పాజిటివ్​ వచ్చింది. 80 మంది చనిపోయారు.

వ్యాక్సినేషన్..

ఇప్పటివరకు దేశంలో 21.83 కోట్ల వాక్సిన్​ డోసుల పంపిణీ జరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇదీ చూడండి:పిల్లలపై కరోనా ప్రభావం- రెండు విధాలుగా!

ABOUT THE AUTHOR

...view details