తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాట 25 వేల దిగువకు కరోనా కేసులు - వివిధ రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు

వివిధ రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తమిళనాడులో 24 వేల కేసులు వెలుగుచూశాయి. కేరళలో 18 వేల కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య కాస్త పెరిగింది.

corona cases in states
కరోనా కేసులు

By

Published : Jun 3, 2021, 11:07 PM IST

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తమిళనాడులో కొత్తగా 24,305 కేసులు నమోదయ్యాయి. 460 మంది ప్రాణాలు కోల్పోయారు. 32,221 మంది డిశ్చార్జ్ అయ్యారు.

దేశ రాజధాని దిల్లీలో కొత్తగా 487 కేసులు వెలుగులోకి వచ్చాయి. 45 మంది మరణించారు.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..

  • మహారాష్ట్రలో 15,229 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. 307 మంది చనిపోయారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 1,268 మందికి కరోనా సోకగా.. మరో 108 మంది వైరస్​ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
  • కేరళలో 18,853 కేసులు నమోదయ్యాయి. 153 మంది మృతి చెందారు.
  • కర్ణాటకలో 18,324 కేసులు బయటపడ్డాయి. 514 మంది మరణించారు.
  • ఒడిశాలో 8,839 కేసులు బయటపడ్డాయి. 42 మంది వైరస్​ ధాటికి బలయ్యారు.
  • బంగాల్​లో 8,811 కేసులు వెలుగుచూశాయి. 108 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశవ్యాప్తంగా గురువారం సాయంత్రం 7 గంటల వరకు 22.37 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చూడండి:ఆ విద్యార్థులకు మోదీ సర్​ప్రైజ్​

ఇదీ చూడండి:కరోనాకు 'మందు'గా పవిత్రజలం- ఎగబడ్డ జనం

ABOUT THE AUTHOR

...view details