తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Corona cases in India: 539 రోజుల కనిష్ఠానికి కరోనా యాక్టివ్ కేసులు - కరోనా నుంచి మొత్తం కోలుకున్నవారు ఎంతమంది?

దేశంలో కరోనా కేసుల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. భారత్​లో కొత్తగా 9,119 కరోనా కేసులు (India covid cases) వెలుగుచూశాయి. వైరస్​ ధాటికి మరో 396 మంది మరణించారు.

corona cases
కరోనా కేసులు

By

Published : Nov 25, 2021, 9:47 AM IST

దేశం​లో క్రితం రోజుతో పోలిస్తే.. కొవిడ్​ కేసుల సంఖ్య (India covid cases) స్వల్పంగా తగ్గింది. తాజాగా 9,119 మందికి కొవిడ్​ పాజిటివ్​గా(Corona cases in India) తేలింది. కరోనా (Coronavirus India)​ ధాటికి మరో 396 మంది మృతి చెందారు. 539 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు పడిపోయాయి.

  • మొత్తం కేసులు: 3,45,44,882
  • మొత్తం మరణాలు: 4,66,980
  • యాక్టివ్​ కేసులు: 1,09,940
  • మొత్తం కోలుకున్నవారు: 3,39,67,962

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా​ కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 6,25,789 మందికి కొవిడ్​​ (Corona update) సోకింది. కరోనా​ ధాటికి 7,767 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25, 96,83,150కు చేరింది. మొత్తం మరణాలు 5,191,344కి చేరాయి.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికాలో కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 1,03,899 మందికి వైరస్​ సోకింది. మరో 1,593 మంది చనిపోయారు.
  • రష్యాలో మరో 33,558 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ఒక్కరోజే 1,240 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రిటన్​లో కొత్తగా 43,696 మందికి వైరస్​​ బారినపడ్డారు. మరో 149 మంది మృతి చెందారు.
  • టర్కీలో కొత్తగా 27,592 కరోనా​ కేసులు నమోదవగా.. 175 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో కొత్తగా మరో 73,966 మందికి కొవిడ్ సోకింది. 321 మంది మరణించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details