Covid Cases in India: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 14,506 మంది వైరస్ బారినపడగా.. మరో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 11,574 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.56 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.23 శాతం వద్ద ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 4,34,33,345
- మొత్తం మరణాలు: 5,25,077
- యాక్టివ్ కేసులు: 99,602
- కోలుకున్నవారి సంఖ్య: 4,28,08,666
Vaccination India: భారత్‌లో మంగళవారం 13,44,788 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,97,46,57,138 కోట్లకు చేరింది. మరో 4,33,659 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 688,426 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,326 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 548,640,377కు చేరింది. మరణాల సంఖ్య 6,353,574కు చేరింది. ఒక్కరోజే 657,755 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 526,246,203గా ఉంది.
- ఫ్రాన్స్‌లో ఒక్కరోజే 1,47,248 కొత్త కేసులు బయటపడగా.. 37 మంది మరణించారు.
- ఇటలీ ఒక్కరోజే 83,555 మంది కొవిడ్ బారినపడగా.. 69 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో 78,448 కేసులు వెలుగుచూశాయి. 268 మందికిపైగా చనిపోయారు.
- బ్రెజిల్లో కొత్తగా 70,166 కేసులు నమోదు కాగా.. 294 మంది మరణించారు.
- తైవాన్‌లో 44,428 కొత్త కేసులు నమోదుకాగా.. 103 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇవీ చదవండి:అపోహల అగ్నిపథం.. తొలగిస్తే విజయపథం..
ప్రత్యేక భయాల 'పంజా'బ్.. సంగ్రూర్ బైపోల్ ఫలితంతో ఉలికిపాటు