Corona Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 4,912 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 38 మంది చనిపోయారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. 5,719 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 0.10 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,45,63,337
- మరణాలు: 5,28,487
- యాక్టివ్ కేసులు: 44,436
- రికవరీలు: 4,39,90,414
Vaccination In India :
దేశంలో మరో 14,76,840 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 217.41 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,03,888 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 4,02,946 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,189 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,95,78,357కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 65,38,727 మంది మరణించారు. మరో 4,32,522 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,93,75,175కు చేరింది.
- జపాన్‌లో కొత్తగా78,058 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 106మంది ప్రాణాలు కోల్పోయారు.
- రష్యాలో కొత్తగా 53,335 కేసులు వెలుగుచూశాయి. మరో 104 మంది మరణించారు.
- తైవాన్‌లో 40,025 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో 37,524 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 33 మంది మృతి చెందారు.
- ఆస్ట్రేలియాలో 36,366 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 105 మంది మృతి చెందారు.