తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో మరింత తగ్గిన కరోనా కేసులు - వ్యాక్సినేషన్​ ఇండియా

Corona Cases in India : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 5,554 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 6,322 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

carona cases in india
కరోనా కేసులు

By

Published : Sep 10, 2022, 9:43 AM IST

Corona Cases in India : దేశంలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 5,554 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 6,322 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.7శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.11 శాతంగా కొనసాగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 48,850 క్రియాశీల కేసులు ఉన్నట్లు తెలిపింది.

Vaccination In India :
దేశంలో శుక్రవారం 21,63,811 కోట్ల మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 214.77 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,76,855 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 4,89,469 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,667 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,29,83,335 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 65,14,456 మంది మరణించారు. శుక్రవారం మరో 7,28,776 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,09,90,157కు చేరింది.

  • జపాన్​లో కొత్తగా 1,12,404 కేసులు వెలుగుచూశాయి. మరో 261 మంది మరణించారు.
  • దక్షిణ కొరియాలో 69,389 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 68మంది మృతి చెందారు.
  • రష్యాలో52,106 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వల్ల 96 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • అమెరికాలో50,622 కొవిడ్ కేసులు నమోదుకాగా, 317 మంది మరణించారు.
  • తైవాలో 34,260 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. 55 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చదవండి:తుక్కు సామగ్రిలో గేర్‌ బాక్సులు.. తెరిచి చూస్తే హెరాయిన్​.. విలువ రూ.200 కోట్లు!

సరిహద్దులో భారత్ వ్యూహాత్మక అడుగులు.. అన్ని స్థావరాల్లో కనీసం ఒక్కో పెద్ద హెలిప్యాడ్‌!

ABOUT THE AUTHOR

...view details