Corona Cases in India : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 6,395 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. మృతుల సంఖ్య 33గా నమోదైంది. ఒక్కరోజులో 6,614 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.7కు పెరిగింది. యాక్టివ్ కేసులు 0.11 శాతానికి పడిపోయాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,44,72,241
- క్రియాశీల కేసులు: 50,342
- మొత్తం మరణాలు: 5,28,090
- కోలుకున్నవారు: 4,39,00,204
Vaccination In India :
దేశంలో బుధవారం 36,31,977 కోట్ల మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 214.27 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,25,602 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 5,12,432 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,556 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,18,59,477 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 65,09,112 మంది మరణించారు. బుధవారం మరో 7,14,421 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 58,94,63,266కు చేరింది.
- జపాన్‌లో కొత్తగా 1,00,729 కేసులు వెలుగుచూశాయి. మరో 282 మంది మరణించారు.
- దక్షిణ కొరియాలో 85,484 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 55 మంది మృతి చెందారు.
- అమెరికాలో50,403 కొవిడ్ కేసులు నమోదుకాగా, 353 మంది మరణించారు.
- రష్యాలో 47,958 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వల్ల 94 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో 42,057 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. 117 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇవీ చదవండి:'దుస్తులు ధరించే హక్కు ఉందంటే విప్పే హక్కూ ఉన్నట్లేనా?'.. హిజాబ్ కేసులో సుప్రీం వ్యాఖ్యలు
'కర్తవ్యపథ్'గా మారనున్న 'రాజ్‌పథ్'.. మోదీ చేతులమీదుగా నేడే ప్రారంభం