తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో మరింత తగ్గిన కరోనా కేసులు, జపాన్​లో పెరిగిన మరణాలు - ప్రపంచ కరోనా మరణాలు

Corona Cases in India భారత్​లో కొత్తగా 7,591 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 9,206 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

corona cases
కరోనా కేసులు

By

Published : Aug 29, 2022, 9:16 AM IST

Corona Cases in India : దేశంలో ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 7,591 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 9,206 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.62 శాతానికి పెరిగింది. యాక్టివ్​ కేసులు 0.19 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,44,08,132
  • క్రియాశీల కేసులు: 84,931
  • మొత్తం మరణాలు: 5,27,799
  • కోలుకున్నవారు: 4,38,02,993

Vaccination In India : దేశంలో ఆదివారం 24,70,330 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,11,91,05,738కు చేరింది. ఒక్కరోజే 1,65,751 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మరింత తగ్గాయి. కొత్తగా 4,56,630 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో మరో 890 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 605,808,634 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 6,488,018 మంది మరణించారు. శనివారం మరో 6,64,326 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 581,048,786 కు చేరింది.

  • జపాన్​లో కొత్తగా 1,72,865 కేసులు వెలుగుచూశాయి. మరో 248 మందికిపైగా మరణించారు.
  • దక్షిణ కొరియాలో 85,295 కొవిడ్​ కేసులు, 70 మరణాలు నమోదయ్యాయి.
  • అమెరికాలో 8,451 కొత్త కేసులు, 8 మరణాలు వెలుగుచూశాయి.
  • ఇటలీ, జర్మనీ, తైవాన్, ఫ్రాన్స్​, బ్రెజిల్​​లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి.

ఇవీ చదవండి:రాంచీలో స్వైన్ ఫ్లూ కలకలం, ఆఫ్రికన్ ఫీవర్​కు 3 వేల పందులు బలి

చేతిలో చిన్నారి మృతదేహం, గుండెల నిండా దుఃఖం, అంబులెన్స్​ లేక కాలినడకన

ABOUT THE AUTHOR

...view details