తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో తగ్గిన కొవిడ్ కేసులు.. కొత్తగా 6,800 మందికి వైరస్ - corona deaths in idnia

Corona Cases in India : భారత్​లో కొత్తగా 6,809 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​ ధాటికి 26 మంది బలయ్యారు. ఒక్కరోజులో 8,414 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

corona cases
corona cases

By

Published : Sep 4, 2022, 9:25 AM IST

Updated : Sep 4, 2022, 9:53 AM IST

Corona Cases in India : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 6,809 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 26 మంది మరణించారు. ఒక్కరోజులో 8,414 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.69 శాతానికి పెరిగింది. యాక్టివ్​ కేసులు 0.12 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,44,56,535
  • క్రియాశీల కేసులు: 55,114
  • మొత్తం మరణాలు: 5,27,965
  • కోలుకున్నవారు: 4,38,65,016

Vaccination In India :
దేశంలో శనివారం 19,35,814 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 213.20 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,20,820 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 441,476 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1177 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 609,810,008కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 6,502,493మంది మరణించారు. శనివారం మరో 587,620 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 586,169,762కు చేరింది.

Last Updated : Sep 4, 2022, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details