తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో మళ్లీ తగ్గిన కొవిడ్ కేసులు.. కొత్తగా ఎన్నంటే? - ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు

Corona Cases in India : భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 5,747 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 5,618 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

CORONA CASES IN INDIA
కరోనా కేసులు

By

Published : Sep 17, 2022, 9:43 AM IST

Corona Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి.. శుక్రవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 5,747 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 29 మంది చనిపోయారు. ఒక్కరోజులో 5,618 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.10 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,45,28,524
  • మరణాలు: 5,28,302
  • యాక్టివ్ కేసులు:46,848
  • రికవరీలు: 4,39,53,374

Vaccination In India :
దేశంలో శుక్రవారం 23,92,530 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 216.41 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,40,211 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 4,71,831 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,663 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,64,91,369 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 65,29,069 మంది మరణించారు. మరో 5,65,492 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,56,72,593 కు చేరింది.

  • జపాన్​లో కొత్తగా 88,379 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 170 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రష్యాలో కొత్తగా 59,035కేసులు వెలుగుచూశాయి. మరో 110 మంది మరణించారు.
  • దక్షిణ కొరియాలో 51,832 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 60 మంది మృతి చెందారు.
  • తైవాన్​లో 41,670 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 46 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • అమెరికాలో 39,301 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 270 మంది మృతి చెందారు.

ఇవీ చదవండి:'నా భర్త మగాడు కాదు'.. పెళ్లైన 8 ఏళ్లకు మహిళ ఫిర్యాదు

చిన్నారులతో టాయిలెట్లు శుభ్రం చేయించిన టీచర్లు

ABOUT THE AUTHOR

...view details