తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే? - ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు

Corona Cases in India : భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా నమోదయ్యాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 5,443 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 5,291 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Corona Cases in India
Corona Cases in India

By

Published : Sep 22, 2022, 9:54 AM IST

Updated : Sep 22, 2022, 10:08 AM IST

Corona Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 5,443 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 26 మంది చనిపోయారు. ఒక్కరోజులో 5,291 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.10 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,45,53,042
  • మరణాలు: 5,28,429
  • యాక్టివ్ కేసులు:46,342
  • రికవరీలు: 4,39,78,271

Vaccination In India :
దేశంలో బుధవారం 15,85,343 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,17,11,36,934 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,39,062 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 4,31,919 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,299 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,85,56,626చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 65,34,484 మంది మరణించారు. మరో 5,27,581 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,83,44,125కు చేరింది.

  • జర్మనీలో 56,978 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 106 మంది మరణించారు.
  • రష్యాలో 53,045 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 107 మంది మృతి చెందారు.
  • అమెరికాలో 47,843 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 375 మంది మృతి చెందారు.
  • తైవాన్​లో 46,902 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 39 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​లో కొత్తగా 38,250 కేసులు నమోదయ్యాయి. వైరస్​ వల్ల 33 మంది మృతి చెందారు.
Last Updated : Sep 22, 2022, 10:08 AM IST

ABOUT THE AUTHOR

...view details