Corona Cases in India: దేశంలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 5,076 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 7,227 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.11 శాతంగా కొనసాగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 47,945 క్రియాశీల కేసులు ఉన్నట్లు తెలిపింది.
Vaccination In India :
దేశంలో శనివారం 17,81,723 కోట్ల మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 214.95 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,20,784 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 3,55,046 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 813 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,34,01,483 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 65,15,608 మంది మరణించారు. శనివారం మరో 7,63,061 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,17,61,294కు చేరింది.
- జపాన్‌లో కొత్తగా 99,663 కేసులు వెలుగుచూశాయి. మరో 212 మంది మరణించారు.
- రష్యాలో69,389 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 97మంది మృతి చెందారు.
- దక్షిణ కొరియాలో42,724 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వల్ల 48 మంది ప్రాణాలు కోల్పోయారు.
- తైవాన్‌లో35,830 కొవిడ్ కేసులు నమోదుకాగా, 30 మంది మరణించారు.
- ఫ్రాన్స్‌లో 19,517 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి.
ఇవీ చదవండి:బాలికపై ఓ ఉన్మాది అత్యాచారయత్నం.. ఆపై కిరోసిన్ పోసి
'రాహుల్ గాంధీ యాత్ర చేసేది ఆ పనికోసమే'.. షా, ఇరానీ విమర్శలు