Corona Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 4,369 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 20 మంది చనిపోయారు. ఒక్కరోజులో 5,178 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.11 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు- 4,45,04,949
- మరణాలు- 5,28,185
- యాక్టివ్ కేసులు- 46,347
- రికవరీలు- 4,39,30,417
Vaccination In India :
దేశంలో సోమవారం 21,67,644 కోట్ల మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 215.47 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,50,468 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 3,47,186 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 835 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,41,63,240 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 65,17,798 మంది మరణించారు. సోమవారం మరో 6,38,544 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,29,97,260 కు చేరింది.
- జపాన్‌లో కొత్తగా 85,025 కేసులు వెలుగుచూశాయి. మరో 127 మంది మరణించారు.
- జర్మనీలో కొత్తగా 54,930 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 90 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రష్యాలో 46,488 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 81 మంది మృతి చెందారు.
- దక్షిణ కొరియాలో 36,938 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వల్ల 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
- తైవాన్‌లో 25,583 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 28 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇవీ చదవండి:నిక్కరు పోస్టుపై దుమారం.. కాంగ్రెస్‌పై భాజపా, ఆర్ఎస్ఎస్ ఎదురుదాడి
గోగ్రా- హాట్‌స్ప్రింగ్స్ నుంచి భారత్, చైనా బలగాలు వెనక్కి.. అక్కడ మాత్రం..