Corona Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 4,129 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 20 మంది చనిపోయారు. రికవరీ రేటు 98.72 శాతంగా ఉంది. గత 24 గంటల వ్యవధిలో 4,688 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 0.10 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,45,72,243
- మరణాలు: 5,28,530
- యాక్టివ్ కేసులు: 43,415
- రికవరీలు: 4,40,00,298
Vaccination In India :
దేశంలో మరో 11,67,772 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,17,68,35,714 కోట్లకు చేరింది. ఒక్కరోజే 1,64,377 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 2,49,111 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 460 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 62,02,42,551కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 65,40,339 మంది మరణించారు. మరో 3,64,837 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 600,289,648కు చేరింది.
- రష్యాలో కొత్తగా 46,758 కేసులు వెలుగుచూశాయి. మరో 95 మంది మరణించారు.
- జపాన్‌లో కొత్తగా40,918 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 69 మంది ప్రాణాలు కోల్పోయారు.
- తైవాన్‌లో 38,980 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 34 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో 31,365కొత్త కేసులు నమోదయ్యాయి.
- దక్షిణ కొరియా 25,792 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 73 మంది మృతి చెందారు.
ఇవీ చదవండి:ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం.. 10 మందికి గాయాలు
రిసార్ట్ కూల్చివేత, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌పై డౌట్స్.. రిసెప్షనిస్ట్ కేసులో మరో ట్విస్ట్!