Covid Cases in India: దేశంలో మరోసారి కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదయ్యాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 18,819 మంది వైరస్ బారినపడగా.. మరో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి 13,827 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.55 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.24 శాతం వద్ద ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 4,34,52,164
- మొత్తం మరణాలు: 5,25,116
- యాక్టివ్ కేసులు: 1,04,555
- కోలుకున్నవారి సంఖ్య: 4,28,22,493
Vaccination India: భారత్‌లో బుధవారం 14,17,217 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,97,61,91,554 కోట్లకు చేరింది. మరో 4,52,430 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 8,65,504 మంది వైరస్ బారినపడ్డారు. మరో 1,607 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 55,17,46,620కు చేరింది. మరణాల సంఖ్య 63,56,175కు చేరింది. ఒక్కరోజే 4,31,332 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 527,203,023గా ఉంది.
- జర్మనీలో కొత్తగా 1,32,671 మందికి వైరస్ సోకగా.. 83 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో ఒక్కరోజే 1,24,724 కొత్త కేసులు బయటపడగా.. 48 మంది మరణించారు.
- అమెరికాలో 1,00,257 కేసులు వెలుగుచూశాయి. 326 మందికిపైగా చనిపోయారు.
- ఇటలీ ఒక్కరోజే 94,165 మంది కొవిడ్ బారినపడగా.. 60 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో కొత్తగా 76,263 కేసులు నమోదు కాగా.. 294 మంది మరణించారు.
- తైవాన్‌లో 42,204 కొత్త కేసులు నమోదుకాగా.. 85 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి :రాష్ట్రపతి ఎన్నికలకు 115 నామినేషన్లు.. పోటీలో ఎంత మంది?