తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నాలుగు నెలల కనిష్ఠానికి కరోనా కొత్త కేసులు - ఇండియా కేసులు

దేశంలో కరోనా కేసులు (Corona cases) గణనీయంగా తగ్గాయి. కొత్తగా 31,443 కేసులు నమోదయ్యాయి. తాజాగా 2,020 మంది వైరస్ బారిన పడి మరణించారు. 118 రోజుల తర్వాత ఇంత తక్కువ మొతాదులో కేసులు వెలుగులోకి రావడం ఇదే ప్రథమం. అయితే మరణాలు మాత్రం ఆందోళనకర స్థాయిలో 2,020 నమోదయ్యాయి.

corona cases
కరోనా కేసులు

By

Published : Jul 13, 2021, 10:52 AM IST

Updated : Jul 13, 2021, 11:44 AM IST

భారత్​లో కరోనా కేసులు సోమవారంతో పోల్చితే భారీగా తగ్గాయి. కొత్తగా 31,443 మందికి వైరస్​ సోకింది. రికవరీ రెటు 97.28 శాతానికి చేరింది. 118 రోజుల కనిష్ఠానికి కొత్త కేసులు చేరాయి. కేసులు తగ్గినా మరణాలు మాత్రం పెరిగాయి. తాజాగా 2,020 మంది వైరస్​తో మృతి చెందారు.

మొత్తం కేసులు:3,09,07,282

మొత్తం మరణాలు: 4,10784

కోలుకున్నవారు: 3,0063720

యాక్టివ్​ కేసులు: 4,32,778

తాజాగా 17,40,325 టెస్టులు చేయగా.. మొత్తం కరోనా పరీక్షలు సంఖ్య 43,40,58,138కి చేరింది.

వ్యాక్సినేషన్:

దేశంలో ఇప్పటివరకు 38,14,67,646 డోసులు పంపిణీ చేసినట్లు ఐసీఎంఆర్​ వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 40,65,862 డోసులు అందించినట్లు తెలిపింది.

ప్రపంచంలో కొవిడ్​ కేసులు

ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 3,90,026 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. 6,422 మంది చనిపోయారు. కాగా 3,94,858 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 188,051,747గా ఉంది.

  • అమెరికా - 34,766,404
  • బ్రెజిల్​ - 19,106,971
  • ఫ్రాన్స్​ - 5,813,899
  • రష్యా - 5,808,473
  • యూకే-5,155,243

ఇవీ చదవండి:కరోనా మూడో దశపై ఐఎంఏ కీలక హెచ్చరికలు

కొవిడ్‌ కోరల్లో బాలింతల విలవిల

Last Updated : Jul 13, 2021, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details