దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గింది. దిల్లీలో కొత్తగా 134 కేసులు బయటపడగా.. మొత్తం కేసుల సంఖ్య 14,32,778కి చేరింది. మరో 467 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశ రాజధానిలో ఇప్పటివరకు కరోనాతో 24,933 మంది మరణించారు.
వివిధ రాష్ట్రాల్లో కేసులు..
- కేరళలో 12,617 కేసులు బయటపడ్డాయి. 11,730 మంది కోలుకోగా 141 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మహారాష్ట్రలో 8,470 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. 9,043 మంది కోలుకోగా.. 188 మంది చనిపోయారు.
- కర్ణాటకలో కొత్తగా 3,709 కేసులు నమోదుకాగా.. 8,111 మంది డిశ్చార్జి అయ్యారు. 139 మంది మృతి చెందారు.