దేశ రాజధాని దిల్లీలో సోమవారం కొత్తగా 85 కేసులు(Covid Cases) మాత్రమే నమోదయ్యాయి. 9 మంది మృతి చెందారు. పాజిటివిటీ రేటు 0.12 శాతంగా నమోదైంది. దిల్లీలో ఈ ఏడాది ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
వివిధ రాష్ట్రాల్లో ఇలా..
- కేరళలో కొత్తగా 12,118 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 11,124 మంది కోలుకోగా, 118 మంది ప్రాణాలు కోల్పోయారు.
- తమిళనాడులో కొత్తగా 5,415 కేసులు నమోదయ్యాయి. 7,661 మంది కోలుకోగా, 148 మంది మృతిచెందారు.
- మహారాష్ట్రలో కొత్తగా 9,812 కేసులు బయటపడ్డాయి. 8,752 మంది డిశ్చార్జ్ కాగా, 179 మంది ప్రాణాలు కోల్పోయారు.
- కర్ణాటకలో కొత్తగా 4,272 కేసులు నమోదు కాగా.. 6,126 మంది డిశ్చార్జి అయ్యారు. 115 మంది మృతిచెందారు.