కేరళలో కరోనా పంజా- మరో 51 వేల మందికి వైరస్ - Corona cases in Kerala
Corona cases in India: కేరళలో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 51 వేల మందికి పైగా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 60 లక్షలకు చేరువైంది.
Corona case in India
By
Published : Jan 30, 2022, 7:51 PM IST
|
Updated : Jan 30, 2022, 10:29 PM IST
Corona cases in India: పలు రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు దిగొస్తుండగా.. కేరళలో మాత్రం పెరుగుతున్నాయి. శనివారంతో పోల్చుకుంటే కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 51,570 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 60 లక్షలకు చేరువైంది.మరో 12 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య 53,666కు చేరింది. 32,701 మంది మహమ్మారిని జయించారు.
కన్నడ నాట తగ్గిన కేసులు
కర్ణాటకలో కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 28,264 కేసులు వెలుగుచూశాయి. మరో 68 మంది మృతి చెందారు. కాగా 29,244 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
తమిళనాడులోనూ కొవిడ్ కేసులు తగ్గాయి. కొత్తగా 22,238 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 38 మంది మరణించారు. 26 వేల మందికిపైగా కోలుకున్నారు.
జమ్ముకశ్మీర్‌లో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. తాజాగా 4,615 మంది వైరస్ బారినపడ్డారు. మరో ఏడుగురు మృతి చెందారు.