Corona cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 10,273 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ నుంచి మరో 20,439 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా 243 మంది మరణించారు. పాజిటివిటీ రేటు 1.0శాతంగా ఉంది.
- మొత్తం మరణాలు: 5,13,724
- యాక్టివ్ కేసులు: 1,11,472
- కోలుకున్నవారు: 4,22,90,921
దేశంలో శనివారం ఒక్కరోజే 10,22,204 కొవిడ్-19 నిర్ధరణ పరీక్షలు చేశారు.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. శనివారం మరో 24,05,049 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 177,44,08,129కు చేరింది.
World Corona cases:
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 13,04,799 కేసులు బయటపడ్డాయి. మొత్తం కేసులు 43,46,60,268కి.. మరణాలు 59,63,105కి చేరుకున్నాయి. రష్యా, జర్మనీ, బ్రెజిల్, దక్షిణ కొరియా దేశాల్లో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
- జర్మనీలో కొత్తగా 1,29,360 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 153మంది కరోనాకు బలయ్యారు.
- అమెరికాలో కొత్తగా 26,003 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా మరో 635 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రష్యాలో తాజాగా 1,22,995కరోనా కేసులు నమోదయ్యాయి. 793మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో రోజువారీ కరోనా మరణాలు సంఖ్య భారీగా ఉంటోంది. 24 గంటల వ్యవధిలో 722మంది చనిపోయారు. కొత్తగా 72,856 కేసులు వెలుగుచూశాయి.
- దక్షిణ కొరియాలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 1,66,206మందికి వైరస్ సోకింది. 112మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో కరోనా మహమ్మారి ధాటికి మరో 101 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 53,623మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
ఇదీ చూడండి:కష్టాల కడలి ఈదలేక.. కుటుంబం ఆత్మహత్య