తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

Corona Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 268 మందికి కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజే 182 మంది కోలుకున్నారు.

corona-cases-in-india
corona-cases-in-india

By

Published : Dec 29, 2022, 10:08 AM IST

Updated : Dec 29, 2022, 12:28 PM IST

Corona Cases in India : భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 268 మందికి కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజే 182 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,46,79,031
  • మరణాలు: 5,30,696
  • యాక్టివ్ కేసులు: 3,552
  • రికవరీలు: 4,41,43,665

Vaccination In India: దేశంలో బుధవారం 99,231 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,20,08,33,449కు చేరింది. ఒక్కరోజే 91వేల మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 4,98,400 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,555 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 66,32,51,506 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 66,91,268 మంది మరణించారు. మరో 3,98,607 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 63,55,35,573కు చేరింది.

  • జపాన్​లో కొత్తగా 216,219 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 415 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దక్షిణ కొరియా 87,517 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 80 మంది మృతి చెందారు.
  • బ్రెజిల్​లో 37,104 కొత్త కరోనా కేసులు వెలుగుచూడగా.. 337 మరణాలు నమోదయ్యాయి.
  • అమెరికాలో కొత్తగా 36,881 కేసులు నమోదయ్యాయి. వైరస్​ కారణంగా 296 మంది ప్రాణాలు విడిచారు.
  • తైవాన్​లో 28,168 కొత్త కరోనా కేసులు వెలుగుచూడగా.. 25 మంది మృతి చెందారు.
Last Updated : Dec 29, 2022, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details