Corona Cases in India : భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 226 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజే 179 మంది కోలుకున్నారు. ముగ్గురు మరణించారు. రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,46,78,384
- మరణాలు: 5,30,702
- యాక్టివ్ కేసులు: 3,653
- రికవరీలు: 4,41,44,029
Vaccination In India: దేశంలో శుక్రవారం 91,732 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,20,10,06,278కు చేరింది. ఒక్కరోజే 1,87,983 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 4,16,690 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,222 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 66,44,53,985 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 66,95,953 మంది మరణించారు. మరో 3,16,088 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 63,64,77,261కు చేరింది.
- జపాన్‌లో కొత్తగా 1,48,784 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 326 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దక్షిణ కొరియా 65,207 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 68 మంది మృతి చెందారు.
- బ్రెజిల్లో 41,271 కొత్త కరోనా కేసులు వెలుగుచూడగా.. 170 మరణాలు నమోదయ్యాయి.
- అమెరికాలో కొత్తగా 30,302 కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 195 మంది ప్రాణాలు విడిచారు.
- హాంగ్‌కాంగ్‌లో 27,830 కొత్త కరోనా కేసులు వెలుగుచూడగా.. 72 మంది మృతి చెందారు.