తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. జపాన్​లో లక్షకుపైగా..

దేశంలో కొత్తగా 201 మందికి కొవిడ్​ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒక్కరోజే 183 మంది కోలుకున్నట్లు తెలిపింది.

corona
corona

By

Published : Dec 24, 2022, 9:30 AM IST

Corona Cases in India: భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 201 మందికి కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజే 183 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 44,676,879
  • మరణాలు: 5,30,691
  • యాక్టివ్ కేసులు: 3,397
  • రికవరీలు: 4,41,42,791

Vaccination In India : దేశంలో శుక్రవారం 1,05,044 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,20,04,04,945కు చేరింది. ఒక్కరోజే 1,36,315 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 493,932 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,356 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 66,09,98,067 కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 66,84,138 మంది మరణించారు. మరో 2,64,840 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 63,37,59,143కు చేరింది.

  • జపాన్​లో కొత్తగా 173,336 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 315 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో 70,415 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 282 మంది మృతి చెందారు.
  • దక్షిణ కొరియాలో 68,168 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
  • ఫ్రాన్స్​లో 43,766 కొత్త కేసులు నమోదవ్వగా.. 158 మంది మరణించారు.
  • అమెరికాలో 29,424 వెలుగుచూడగా.. 135 మంది మృతిచెందారు.

ABOUT THE AUTHOR

...view details