Corona Cases in India : భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 188 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజే 141 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,46,78,763
- మరణాలు: 5,30,696
- యాక్టివ్ కేసులు: 3,468
- రికవరీలు: 4,41,43,483
Vaccination In India: దేశంలో సోమవారం 90,529 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,20,07,34,218కు చేరింది. ఒక్కరోజే 1,34,995 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 4,20,298 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 963 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 66,25,61,176కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 66,88,440 మంది మరణించారు. మరో 4,13,586మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 63,51,30,801కు చేరింది.
- జపాన్‌లో కొత్తగా 2,02,853 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 271 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో 35,856 కొత్త కరోనా కేసులు వెలుగుచూడగా.. 250 మరణాలు నమోదయ్యాయి.
- దక్షిణ కొరియా 87,596 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 50 మంది మృతి చెందారు.
- అమెరికాలో కొత్తగా 17,302 కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 69 మంది ప్రాణాలు విడిచారు.
- హాంగ్‌కాంగ్‌లో 18,626 కొత్త కేసులు నమోదవ్వగా..53 మంది చనిపోయారు.
- తైవాన్‌లో 24,498 వెలుగుచూడగా.. ఏడుగురు మృతిచెందారు.