Corona Cases in India: భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 157 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 4,46,77,459
- మరణాలు: 5,30,696
- యాక్టివ్ కేసులు: 3,421
- రికవరీలు: 4,41,43,342
Vaccination In India: దేశంలో సోమవారం 97,622 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,20,06,43,689కు చేరింది. ఒక్కరోజే 49,464 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 213,618 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 759 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 66,20,60,598కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 66,87,161 మంది మరణించారు. మరో 4,23,531మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 63,46,70,641కు చేరింది.
- జపాన్‌లో కొత్తగా 77,256 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 306 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో 31,032 కొత్త కరోనా కేసులు వెలుగుచూడగా.. 83 మరణాలు నమోదయ్యాయి.
- దక్షిణ కొరియా 25,545 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 42 మంది మృతి చెందారు.
- హాంగ్‌కాంగ్‌లో 19,398 కొత్త కేసులు నమోగవ్వగా..47 మంది చనిపోయారు.
- తైవాన్‌లో 14,234 వెలుగుచూడగా.. 14 మంది మృతిచెందారు.
కొవిడ్ సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్
కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ఆసుపత్రుల్లో సౌకర్యాలపై మాక్‌డ్రిల్ నిర్వహించేందుకు మంగళవారం ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సిద్ధమయ్యాయి. ఈ నెల 27న ఈ కార్యక్రమం నిర్వహించాలని కేంద్రం ఇది వరకే ఆయా రాష్ట్రాలకు సూచించింది. ఆరోగ్య సౌకర్యాలు, ఐసోలేషన్ బెడ్లు, ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు, డాక్టర్లు, నర్సులు, ఆయుష్ డాక్టర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్ల లభ్యత.. అంబులెన్సు, పరీక్షా పరికరాలు, అవసరమైన మందులు తదితర అంశాలపై డ్రిల్ నిర్వహించనున్నారు.