కేరళలో కరోనా (Corona cases) కేసులు స్వల్పంగా పెరిగాయి. అక్కడ కొత్తగా 11,079 కేసులు నమోదయ్యాయి. మరో 9,972 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 123 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 26,571కి చేరింది.
మిజోరంలో కొత్తగా 1,224 కరోనా కేసులు వెలుగు చూశాయి. బాధితుల్లో 237 మంది చిన్నారులు ఉన్నారు. మరో నలుగురు చనిపోయారు.