Covid Cases in India: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. సోమవారం 9,923 మంది వైరస్ బారినపడగా.. మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినుంచి 7,293 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.62 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.17 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2.55 శాతంగా ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 43,319,396
- మొత్తం మరణాలు: 5,24,890
- యాక్టివ్ కేసులు: 79,313
- కోలుకున్నవారి సంఖ్య: 4,27,15,193
Vaccination India: భారత్లో సోమవారం 13,00,024 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,96,32,43,003 కోట్లకు చేరింది. మరో 3,88,641 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. ఒక్కరోజే 3,03,828 మంది వైరస్ బారినపడ్డారు. మరో 752 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 544,801,795 కు చేరింది. మరణాల సంఖ్య 6,340,676కు చేరింది. ఒక్కరోజే 554,477 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 520,076,876 గా ఉంది.
- బ్రెజిల్లో కొత్తగా 51,925 కరోనా కేసులు నమోదు కాగా.. 108 మంది మరణించారు.
- తైవాన్లో మరో 35,632 కేసులు.. 144 కుపైగా మరణాలు నమోదయ్యాయి.
- అమెరికాలో 22,762 కేసులు వెలుగుచూశాయి. 31 మందికిపైగా చనిపోయారు.
- ఆస్ట్రేలియాలో 20,214 కరోనా కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి.
- ఇటలీ ఒక్కరోజే 16,571 మంది కొవిడ్ బారినపడగా.. 59 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఉత్తర కొరియాలో 17,260 కేసులు బయటపడ్డాయి.
ఇదీ చదవండి:'ప్రపంచ శాంతికి యోగా.. భారతీయ సంస్కృతికి ప్రతీక'