తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. భారీగా పెరిగిన మరణాలు - ఈరోజు కరోనా కేసులు

Covid cases in india: భారత్​లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజే 13,313 మందికి వైరస్​ సోకింది. మరో 38 మంది చనిపోయారు. 10,972 మంది కోలుకున్నారు.

Covid cases in india
Covid cases in india

By

Published : Jun 23, 2022, 9:31 AM IST

Updated : Jun 23, 2022, 9:40 AM IST

Covid Cases in India: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. బుధవారం ఉదయం నుంచి గురువారం వరకు ఒక్కరోజే 13,313 మంది వైరస్​ బారినపడగా.. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 10,972 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.60 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.19 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2.03 శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 2.81 గా నమోదైంది.

  • మొత్తం కరోనా కేసులు: 4,33,44,958
  • మొత్తం మరణాలు: 5,24,941
  • యాక్టివ్​ కేసులు: 83,990
  • కోలుకున్నవారి సంఖ్య: 4,27,36,027

Vaccination India: భారత్​లో బుధవారం 14,91,941 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,96,62,11,973 కోట్లకు చేరింది. మరో 6,56,410 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు తగ్గగా.. మరణాలు పెరిగాయి. ఒక్కరోజే 7,24,039 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,519 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 546,564,997కు చేరింది. మరణాల సంఖ్య 6,345,548కు చేరింది. ఒక్కరోజే 527,556 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 522,143,299గా ఉంది.

  • జర్మనీలో ఒక్కరోజే 119,762 కొత్త కేసులు బయటపడగా.. 105 మంది మరణించారు.
  • అమెరికాలో 93,837 కేసులు వెలుగుచూశాయి. 390 మందికిపైగా చనిపోయారు.
  • ఫ్రాన్స్​లో 77,967 కొత్త కేసులు నమోదుకాగా.. 66 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 70,285 కరోనా కేసులు నమోదు కాగా.. 176 మంది మరణించారు.
  • ఇటలీ ఒక్కరోజే 53,905మంది కొవిడ్​ బారినపడగా..50 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి:దేశంలో మళ్లీ పెరిగిన కరోనా.. కొత్తగా 12 వేలకుపైగా కేసులు

Last Updated : Jun 23, 2022, 9:40 AM IST

ABOUT THE AUTHOR

...view details