Covid Cases in India: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం వరకు 11,739 మంది వైరస్ బారినపడగా.. మరో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 10,917మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.58 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.21 శాతం వద్ద ఉండగా.. డైలీ పాజిటివిటీ రేటు 2.59 శాతంగా ఉంది.
- మొత్తం కరోనా కేసులు: 43,389,973
- మొత్తం మరణాలు: 524999
- యాక్టివ్ కేసులు: 92,576
- కోలుకున్నవారి సంఖ్య:4,27,72,398
Vaccination India: భారత్లో శనివారం 12,72,739 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,97,08,51,580 కోట్లకు చేరింది. మరో 4,53,940 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 442,791 మంది వైరస్ బారినపడ్డారు. మరో 827 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 548,640,377కు చేరింది. మరణాల సంఖ్య 63,50,240 చేరింది. ఒక్కరోజే 307,082 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 523,479,348గా ఉంది.
- జర్మనీలో ఒక్కరోజే 89,336 కొత్త కేసులు బయటపడగా.. 84 మంది మరణించారు.
- ఇటలీ ఒక్కరోజే 56,386మంది కొవిడ్ బారినపడగా..40 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో 43,667 కేసులు వెలుగుచూశాయి. 62 మందికిపైగా చనిపోయారు.
- తైవాన్లో 40,398 కొత్త కేసులు నమోదుకాగా.. 151మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రెజిల్లో కొత్తగా 31,230 కేసులు నమోదు కాగా.. 136మంది మరణించారు.
ఇదీ చదవండి:దేశంలో కొత్తగా 15,940 మందికి వైరస్.. పెరిగిన మరణాలు