తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​కు కరోనా మూడోదశ ముప్పు- కేంద్రానికి కీలక నివేదిక - జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నిపుణుల కమిటీ

corona
భారత్​కు కరోనా మూడోదశ ముప్పు- కేంద్రానికి కీలక నివేదిక

By

Published : Aug 23, 2021, 11:10 AM IST

Updated : Aug 23, 2021, 1:16 PM IST

11:07 August 23

భారత్​కు కరోనా మూడోదశ ముప్పు- కేంద్రానికి కీలక నివేదిక

దేశంలో కరోనా మూడోదశ ముప్పు(Third wave in India) పొంచి ఉందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్​ఐడీఎం) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ హెచ్చరించింది. కరోనా మూడోదశ(Corona third wave) అక్టోబర్‌లో తారస్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని తెలిపింది. చిన్నారులు పెద్ద సంఖ్యలో కరోనా(Coronavirus) బారిన పడితే.. దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు ఏ మాత్రం సరిపోవని అభిప్రాయపడింది. పెద్దల వలె పిల్లలు ప్రభావితం కావొచ్చని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ సూచనలు చేసింది. 

ఈ మేరకు తమ నివేదికను కమిటీ ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించినట్లు ఓ వార్త సంస్థ కథనం పేర్కొంది. 'థర్డ్‌వేవ్‌ ప్రిపేర్డ్‌నెస్: చిల్డ్రన్ వల్నరబిలిటీ అండ్ రికవరీ శీర్షికన వెలువడిన ఈ నివేదిక ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మూడోవేవ్‌లో(Third wave of corona) చిన్నారులు భారీగా కరోనా బారిన పడి, ఆసుపత్రిలో చేరే పరిస్థితి తలెత్తితే.. వైద్య సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్సులు వంటి వైద్య సేవలు అవసరానికి తగ్గట్టుగా అందుబాటులో లేవని నిపుణుల కమిటీ పేర్కొంది. అలాగే చికిత్స సమయంలో వైరస్‌ సోకిన పిల్లలతో సంరక్షకులు సురక్షితంగా ఉండేలా కొవిడ్ వార్డుల నిర్మాణం ఉండాలని ప్రతిపాదించింది. అలానే వైకల్యంతో బాధపడుతున్న పిల్లలు, ఇతర వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులకు టీకా(Vaccination) వేయాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసింది.

'అందుకు సిద్ధమే'

మూడోదశను(Third wave in India) ఎదుర్కోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, చిన్నపిల్లల వైద్యసేవల వ్యవస్థ బలోపేతానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఇటీవలే కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ వెల్లడించారు. మరోవైపు చిన్నారులకు టీకా అందించే దిశగా అడుగులు పడుతున్నాయి. మూడు రోజుల క్రితం అత్యవసర ఆమోదం పొందిన జైడస్ క్యాడిలా.. దేశంలో 12 ఏళ్లు దాటిన వారికి అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబర్ మధ్య నుంచి టీకా సరఫరా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌(Bharat Biotech Covaxin) కూడా ప్రస్తుతం పిల్లలపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తోంది.

ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో భారత్‌లో కరోనా రెండోదశ(Covid 2nd wave) అల్లకల్లోలం సృష్టించింది. వైద్య సేవలు, ఆస్పత్రిలో పడకలు, ఆక్సిజన్‌ కొరత కారణంగా కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సెకండ్‌వేవ్‌ తగ్గుముఖం పడుతున్న సమయంలో మూడోదశ ఆందోళన మొదలైంది. దీంతో ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా వైద్య సదుపాయాల కల్పనకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రతి 100 వైరస్ పాజిటివ్‌ కేసుల్లో 23 మందికి ఆసుపత్రిలో వైద్య సేవలు అందేలా సన్నాహాలు చేయాలని నీతి ఆయోగ్‌ ఇప్పటికే ప్రభుత్వానికి సూచించింది

Last Updated : Aug 23, 2021, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details