ఐక్యరాజ్యసమితి 26వ వాతావరణ మార్పుల సమావేశం(సీఓపీ) అధ్యక్షుడిగా ఎంపికైనా బ్రిటన్ ఎంపీ అలోక్ శర్మ.. భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ ఏడాది నవంబర్లో జరగబోయే ఐక్యరాజ్యసమితి 26వ వాతావరణ మార్పుల ముసాయిదా సమావేశంలో(యూఎన్ఎఫ్సీసీసీ) వాతావరణ మార్పుల మీద భారత్-బ్రిటన్ల సహకారంపై చర్చించినట్లు అలోక్ తెలిపారు. మంగళవారం జరిగిన ఈ భేటీపై మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
"సీఓపీ26 అధ్యక్షుడిగా ఎంపికైన అలోక్తో సమావేశంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. నవంబర్లో జరిగే యూఎన్ఎఫ్సీసీసీ సమావేశంలో వాతావరణ మార్పులపై భారత్-బ్రిటన్ల సహకారంపై చర్చించాం."
-నరేంద్ర మోదీ, భారత ప్రధాని