జమ్ముకశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కరోనా కట్టడికి విధించిన కర్ఫ్యూ విధుల్లో ఉన్న పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారు. ముష్కరుల దాడిలో గులాం మహ్మద్ అనే పోలీసు సిబ్బంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
చీకటి కారణంగా ఉగ్రవాదులు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రుల్లో చేర్పించినట్లు పేర్కొన్నారు.