తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జూదానికి బానిసైన పోలీసు.. భార్య, అత్తమామలపై కత్తితో దాడి - పోలీసు జూదం

Police Attacks In Laws And Wife: జూదానికి బానిసైన ఓ పోలీసు విచక్షణారహితంగా ప్రవర్తించాడు. పుట్టింటికి వెళ్లిన తన భార్యతో సహా అత్తమామలను కత్తితో గాయపరిచాడు. చికిత్స పొందుతున్న మామ చనిపోయాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో జరిగింది.

cop-addicted-to-gambling-kills-father-in-law
cop-addicted-to-gambling-kills-father-in-law

By

Published : Apr 11, 2022, 8:45 AM IST

Police Attacks In Laws And Wife: మహారాష్ట్రలోని నాసిక్​లో విషాదం నెలకొంది. మన్మాడ్​ పోలీసుస్టేషన్​లో పనిచేస్తున్న సూరజ్​ ఉగల్ముగ్లే జూదానికి బానిసై.. భార్య, అత్తామామలను కత్తితో పొడిచాడు. గాయపడిన మామ నివృత్తి సంగ్లే చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. దీంతో నిందితుడిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు సూరజ్​ కోసం గాలిస్తున్నారు.

నిందితుడు సూరజ్​ ఉగల్ముగ్లే

పోలీసుల కథనం ప్రకారం.. సూరజ్​ ఉగల్ముగ్లే అనే పోలీసు జూదానికి పూర్తిగా బానిసైపోయాడు. తరచూ భార్య పూజా సిన్నార్​తో గొడపడేవాడు. అయితే కొద్ది రోజుల క్రితం పూజా తన కన్నవారింటికి వెళ్లింది. శుక్రవారం సాయంత్రం అత్తవారింటికి వెళ్లిన సూరజ్​.. అక్కడ భార్య, అత్తమామలతో గొడవపెట్టుకున్నాడు. భార్య పూజాతోపాటు మామ నివృత్తి సాంగ్లే, అత్త షీలాను తీవ్రంగా గాయపరిచాడు. వారిని ఇరుగు పొరుగువారు స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న మామ నివృత్తి సాంగ్లే ఆదివారం ఉదయం మరణించాడు. నిందితుడి అత్త షీలా పరిస్థితి విషమంగా ఉంది

ఇదీ చదవండి: లంక నుంచి భారత్​కు తమిళులు.. శరణుకోరుతూ!

ABOUT THE AUTHOR

...view details