కూనూర్ హెలికాప్టర్ ప్రమాదం ఘటనలో మరో ఆరు మృతదేహాలను గుర్తించారు అధికారులు. వాటిల్లో నలుగురు భారత వాయుసేన సభ్యులు కాగా.. మరో ఇద్దరు సైన్యానికి చెందినవారు.
"నలుగురు ఐఏఎఫ్ సిబ్బందిని గుర్తించే ప్రక్రియ పూర్తయింది. అంతిమసంస్కారాల కోసం మృతదేహాలను విమానాల్లో తరలిస్తాము. ఇప్పటికే కుటుంబసభ్యులకు మృతదేహాలను అప్పగించాము. పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి." అని సైన్యం ఓ ప్రకటన చేసింది.
తమిళనాడు కూనూర్‌లో సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్.. బుధవారం ఘోర ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో మొత్తం 14మంది హెలికాప్టర్లో ఉన్నారు. బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ సహా మొత్తం 13 మంది ఈ ఘటనలో మరణించారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్.. బెంగళూరులో చికిత్స పొందుతున్నారు.