Mysore University Gold Medals: చదువుపై ఆసక్తి ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా అధిగమించవచ్చని నిరూపించారు కర్ణాటకకు చెందిన పీ మహాదేవస్వామి, వీ తేజశ్విని. ఇద్దరూ చిన్నప్పుడే కుటుంబ పెద్దలను కోల్పోయినా మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు. ఎన్ని కష్టాలొచ్చినా చదువు మాత్రం ఆపలేదు. ఇప్పుడు యూనివర్సిటీలో గోల్డ్ మెడల్స్ సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మంగళవారం జరిగిన మైసూర్ యూనివర్సిటీ 102వ స్నాతకోత్సవంలో మహాదేవస్వామి 14 గోల్ట్ మెడల్స్, 3 నగదు బహుమానాలు గెలుపొందగా.. తేజశ్విని 9 గోల్డ్ మెడల్స్‌తో పాటు 10 క్యాష్ ప్రైజ్‌లు కైవసం చేసుకుంది.
MA Gold Medals : మహాదేవస్వామికి ఈ మెడల్స్ అన్నీ ఎంఏ కన్నడలో వచ్చాయి. చామరాజనగర్‌లోని డా. బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో పీజీ చేశాడు. నాగవల్లికి చెందిన ఇతని తండ్రి 20 ఏళ్ల క్రితమే మరణించాడు. అప్పటి నుంచే అమ్మ అన్నీ తానై చూసుకుంది. ఇతడ్ని చదివించేందుకు రోజూ కూలీ పని చేసేది. అయినా మహాదేవస్వామి ఏనాడు చదువుపై ఆసక్తి కోల్పోలేదు. ఉన్నత విద్యకు అవసరమయ్యే ఖర్చుల కోసం మేస్త్రీగా, పెయింటర్‌గా కూడా పని చేశాడు. ఇప్పుడు 14 మెడల్స్ సాధించి అందరి మన్ననలు పొందుతున్నాడు. తాను భవిష్యత్తులో ఐఏఎస్ అధికారి అయి సమాజానికి సేవ చేస్తానని చెబుతున్నాడు.