Controversies on TTD Nitya Annadanam in Tirumala:తిరుమల పేరు చెప్పగానే ఆ దేవదేవుడిపై భక్తుల్లో ఎంతో విశ్వాసం, నమ్మకం. తిరుమల వచ్చే భక్తులు ఎంతటి వారైనా తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్నప్రసాదం స్వీకరిస్తారు. ఆ అన్నప్రసాదానికి ఎంతో గుర్తింపు ఉంది. దేశవ్యాప్తంగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్న ఆలయాల్లో టీటీడీ ప్రథమస్థానంలో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే తిరుమల లడ్డూ ప్రసాదం అంటే దేశ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు ఆ లడ్డూ ప్రసాదం నాణ్యత కూడా తగ్గించేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమలలో జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటోంది.
తిరుమల దేవస్థానంలో ఎంతో పవిత్రమైన హోదాగా భావించే టీటీడీ ఛైర్మన్ నియామకానికి సంబంధించి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తిరుమలలో ఓ బాలికను చిరుత హతమార్చిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే దానికి ప్రత్యామ్నాయంగా నడక దారిలో ఇనుప కంచెలు ఎర్పాటు చేయకుండా కర్రలు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. తిరుమల ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా టీటీడీ పాలన యంత్రాంగం ప్రవర్తిస్తోందని విమర్శలు తలెత్తుతున్నాయి.
TTD Nitya Annadanam:తిరుమలలో నిత్యాన్నదానంపైవివాదాలు ముసురుకుంటున్నాయి. టీటీడీ అందించే భోజనంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాసిరకమైన ఆహార అందిస్తుండటంతో భక్తుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. నిరసన వ్యక్తం చేసిన భక్తులు అన్నప్రసాదాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం నాణ్యత సరిగా లేదని కొంతమంది భక్తులు టీటీడీ సిబ్బందిపై తిరగబడ్డారు. అన్నదాన సత్రానికి వచ్చిన భక్తులు సిబ్బంది వడ్డించిన అన్నం ఉడకలేదని, మరికొంత ముద్దగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇది అన్నమా ఎవరూ తినలేకపోతున్నారని ఆగ్రహంచారు. అన్నప్రసాదం దారుణంగా ఉంది చాలామంది ఆకుల్లో వదిలేశని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణానికి అన్నం ఆరిపోయి అలా అయిందని ఉద్యోగి చెప్పగా భక్తులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. కోట్ల రూపాయలు కానుకలు సమర్పిస్తుంటే నాణ్యమైన అన్నం అందించలేరా అని ప్రశ్నించారు. అన్నప్రసాదాలను వీడియో తీసి మీడియాకు విడుదల చేశారు.