తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నడిరోడ్డుపై రూ.535 కోట్లు.. నగదు తరలిస్తున్న ట్రక్కు బ్రేక్​డౌన్.. చివరకు.. - chennai rbi vehicle got repaired

రిజర్వ్​ బ్యాంక్​కు చెందిన రూ.535 కోట్లతో వెళ్తున్న ఓ కంటైనర్​ రోడ్డు మధ్యలో మొరాయించింది. వివిధ బ్యాంకులకు నగదును తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే

Containers in the middle of the road with Rs.535 crore currency high tension in Chennai
మొరాయించిన రూ.535 కోట్లతో వెళ్తున్న కంటైనర్​.. అక్కడికి వెనక్కి పంపిన అధికారులు!

By

Published : May 17, 2023, 10:33 PM IST

Updated : May 17, 2023, 10:59 PM IST

రూ.535 కోట్లతో వెళ్తున్న ఓ కంటైనర్​ రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కంటైనర్​ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రిపేర్​ చేసేందుకు ప్రయత్నించినా బాగు కాకపోవడం వల్ల తిరిగి ఆర్​బీఐకి పంపారు.

అసలేం జరిగిందంటే
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెన్నై శాఖ నుంచి విల్లుపురం జిల్లాలోని వివిధ బ్యాంకులకు రెండు కంటైనర్లలో నగదును తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ కంటైనర్​ రోడ్డు మధ్యలో మొరాయించింది. చెడిపోయిన వాహనంతో పాటు మరో వాహనంతో కలిపి మొత్తం రూ.535 కోట్ల నగదు ఉంది. దీంతో దగ్గర్లోని పోలీస్​ స్టేషన్​కు సమాచారం అందించారు సిబ్బంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. 200 మందితో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

కంటైనర్లలో ఒకటి జీఎస్టీ జాతీయ రహదారిపై చెడిపోవడం వల్ల మరొక వాహనాన్ని కూడా ఆపాల్సి వచ్చింది. అనంతరం వీటిని సమీపంలోని సిద్ధా హాస్పిటల్ కాంప్లెక్స్‌కు తరలించారు. పోలీసుల భద్రత నడుమ చెడిపోయిన వాహనాన్ని మెకానిక్​లు రిపేర్​ చేసేందుకు ప్రయత్నించగా.. విఫలమయ్యారు. దీంతో చేసేదేమిలేక రెండు వాహనాలను తిరిగి రిజర్వ్ బ్యాంక్​ ఆఫ్ ఇండియా చెన్నై శాఖకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం రికవరీ వెహికల్‌ను తెప్పించి తరలించారు అధికారులు.

"నగదును నిత్యం ఈ వాహనాల్లోనే తరలిస్తాం. ఒక కంటైనర్​కు సంబంధించిన ఇంజిన్​ ఫెయిల్​ కావడం వల్ల మరో ట్రక్కును కూడా ఆపాల్సి వచ్చింది. రిపేర్​ చేసినప్పటికీ వాహనం స్టార్ట్ కాలేదు. దీంతో రూ.535 కోట్లను తిరిగి చెన్నైలోని రిజర్వ్​ బ్యాంక్​కు తీసుకెళ్లాం."

---ట్రక్కు డ్రైవర్​

మురికి కాలువలో నోట్ల కట్టలు!
ఇటీవలే బిహార్​ రోహ్తాస్ జిల్లాలోని ఓ మురుగు కాలువలో నోట్ల కట్టలు ఉన్నాయనే వార్తతో స్థానికులందరు భారీగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున కాలువ వద్దకు చేరుకుని డబ్బుల కోసం వెతికారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ నోట్ల కట్టల కోసం కాలువ వద్దకు చేరి వెతకడం ప్రారంభించారు. సాసారంలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయినా వారేం చేయలేకపోయారు. పోలీసులు మాత్రం ఇదంతా పుకార్లు మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. అయితే స్థానిక ప్రజలు మాత్రం.. తమకు నోట్ల కట్టలు దొరికాయని చెబుతున్నారు. శనివారం ఉదయం తాము కాలువలో నోట్లు తేలడాన్ని గుర్తించామని వారు వెల్లడించారు. దీంతో అందులోకి దిగి డబ్బులు కోసం వెతుకామని పేర్కొన్నారు. కాలువలో నోట్ల కట్టలు ఉన్నాయనే సమాచారం.. కొంత సమయంలోనే ఊరంతా పాకిందని వారు వెల్లడించారు. దీంతో చాలా మంది కాలువ వద్దకు చేరుకుని డబ్బుల కోసం వెతికారని తెలిపారు.ఈ కథనానికి సంబంధించిన వీడియోను చూసేందుకు ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

Last Updated : May 17, 2023, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details